భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది. 2023, సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024, జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోంది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది. 2023, సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024, జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భూమి, సూర్యుని గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి సమతుల్యం చేసుకునే ప్రదేశంలో లాగ్రాంజియన్ పాయింట్ L1 అనేది ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది భూమి నుంచి సూర్యుని దిశలో దాదాపు 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉంటుంది. ఆదిత్య L1 ఈ పాయింట్ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా భూమి లేదా చంద్రుడి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా సూర్యుడిని నిరంతరం గమనించగలుగుతుంది. ఆదిత్య L1 సన్ మాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ విండో, కరోనా, మంటలు, క్రోమోస్పియర్ వంటి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ఏడు సైంటిఫిక్ ఇన్‌స్ట్రమెంట్స్‌తో పనిచేస్తుంది. ఈ ఇన్స్ట్రమెంట్స్ నాలుగు వేర్వేరు వేవ్‌లెంత్స్‌లో సూర్యుని చిత్రాలను, వర్ణపటాల ను క్యాప్చర్ చేస్తాయి, మిగిలిన మూడు స్పేస్‌క్రాఫ్ట్ చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోని ప్లాస్మా, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ కొలుస్తాయి.
చివరి దశకు ఆదిత్య L1 స్పేస్‌క్రాఫ్ట్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
83
previous post