బెల్లంపల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఆలస్యం, అందులో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ పథకాల నుండి మహాలక్ష్మి పథకాన్ని తొలగించాలని, దానివల్ల తమ జీవనాధారం కోల్పోతామని పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అంతా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలనే నమ్ముకుని తాము బ్రతుకు బండిని లాగుతున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో లక్షల కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుందని, ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు పదివేల రూపాయల EMI లు కట్టవలసి ఉంటుందన్నారు. వికలాంగులకు, 60 సంవత్సరాలు దాటిన వృద్దులకు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. కానీ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వెంటనే తొలగించాలని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయమై తమ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. నాలుగైదు రోజులల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలగించకపోతే తాము తమ కుటుంబాలతో రోడ్డు పైకి వచ్చి బిక్షాటన చేస్తామని తెలిపారు.
బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్ల ఆందోళన..
75
previous post