65
ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు హేమావతి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ శివ యూనియన్ జిల్లా కార్యదర్శి చాముండేశ్వరులు మాట్లాడుతూ ఆశా కార్మికులకు అనేక సమస్యలతో ఉన్నారని ప్రభుత్వం అధికారులు హామీలు ఇచ్చారు తప్ప, అమలు చేయడం లేదని వాటిని అమలు చేయాలి అని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది