72
ఆరుగాలం కష్టపడే రైతులకు అన్ని కష్టాలే. దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడుతున్నా ఫలితం దక్కడం గగనమై పోతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. భామిని మండలం భామిని గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏనుగుల దాటికి భయపడి పొలం పనులకు వెళ్లేందుకు కూడా గ్రామస్తులు జంకుతున్నారు. ఏళ్ల తరబడి ఏనుగులు వచ్చి పంట పొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బారి నుంచి కాపాడాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీ రైతాంగం మండిపడుతోంది.