రాజకీయాల కోసం నీజాయితీ కలిగిన నాలాంటి అధికారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం సరైన సాంప్రదాయం కాదని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు. నెల్లూరుకు చెందిన టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. వెంకటరమణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై చర్చించేందుకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దేవాదాయశాఖ చట్టం సెక్షన్ 107 ప్రకారం టీటీడీ ఇఓ గా నియామకం కావాలంటే జిల్లా కలెక్టర్ లేదా సమాన హోదాలో పని చేసి వుండాలనే విషయాన్ని వెల్లడించారు.1991 సివిల్ సర్వీసెస్ బ్యాచ్ కి చెందిన నేను ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరి హోదా పోస్టులో భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. నా నియామకం పై హైకోర్టులో పిల్ ధాఖలు చేస్తే దానిని హైకోర్టు కోట్టివేసిన విషయాన్ని ధర్మారెడ్డి తెలిపారు. 2014లో డిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్ సిఇఓగా వున్నప్పుడు అక్రమ కట్టడాలు పై చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు.దానికి సంబంధించి తాము సీల్ వేసిన ఓ భవనం యజమాని ఆరేళ్ల తర్వాత 2020లో కోర్టులో ప్రవైట్ కేసు వేస్తే దానికి సంబంధించి సమన్లు గత ఏడాది జారి చేసారు. సమన్లు అందుకున్న అనంతరం తాను హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు స్టే విధించిన్నట్లు తెలిపారు. తాను టిటిడి లో అవినీతి చేసానని ఆరోపించడంపై తీవ్ర ఆగ్రహం చెందారు. తాను వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీటీడీకి ఎంత ఆదాయం వచ్చింది, ఏమేమి నిర్మించామో ఎలా నిర్మించాము అనేది బహిరంగ చర్చకు తను సిద్ధమని, ఆనం దీనిని స్వీకరిస్తారా అని అన్నారు
అవినీతి ఆరోపణలు చాలా బాధాకరం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి
62
previous post