చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన….

An innovative protest with flowers in the ear.

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా రేపల్లెలో అంగన్వాడిలు చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలియజేయడం జరిగింది&period; 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు&period; ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్&comma; హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జే&period; ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని జీతాలు పెంచలేమని చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు&period; రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు&period; కనీస వేతనాలు అమలు చేయమంటాం&comma; పెన్షన్ ఇవ్వమనటం&comma; రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమనటం&comma; నేరం అన్నట్లు ప్రచారం నిర్వహిస్తామన్నారు&period; మేము అడిగేది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పట్టు విడవకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు&period; సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు&period; అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్&period; మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు ఆందోళన కొనసాగించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాబోయే కాలంలో కలెక్టరేట్లు ముట్టడిస్తామని&comma; ఛలో విజయవాడ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పందించాలని అంగన్వాడీలను భయభ్రాంతులను చేయటం విరమించుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.