కాకినాడ జిల్లా జగ్గంపేటలో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సోరంపాలెం బాలు జనసేన, టిడిపి నాయకులకు తో కలిసి జగ్గంపేట మండలం మన్యం వారి పాలెం నుండి రాజపూడి గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది లేదని అన్నారు. గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా రాజపూడి నుండి మన్యం వారిపాలెం, కృష్ణాపురం వరకు కోటి 30 లక్షల రూపాయలతో రోడ్డు పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అసమర్థ్యంతో ఈ రోడ్డు వర్క్ ఆర్డర్ రద్దుచేసి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఒక తట్ట మట్టి కూడా వేసి గుంతలు పూచలేదని ఎమ్మెల్యే గెలిచిన వెంటనే శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గం లోని 20 లింక్ రోడ్లను పూర్తి చేయాలని చెప్పడం జరిగిందని అన్నారు. ఈ రాష్ట్రంలో రోడ్లకు గుంతలు, గోతులు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ పాలనలో గుంతలప్రదేశ్ గా మారిన ఆంధ్రప్రదేశ్
72
previous post