ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు
120
previous post