చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి, ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. అయితే.. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణం అసన్నమైoది. కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మికి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి అరటి గెలలు నేలమట్టమయ్యి.. దర్శనం ఇచ్చాయి. సంవత్సర కాలం పంటల సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు వరలక్ష్మి. 6 సంవత్సరాలుగా పంటలు చేస్తున్నామని.. కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నష్ట పరిహారం అందినదని.. నాటిన మొలకలకు కూడా 30 వేల ఆర్థిక సహాయం అందినదని హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమ పరిస్థితి చూసి తమకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని.. సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు భీభత్సం….
60
previous post