తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు.అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్కు పంపనున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.