తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు.అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్కు పంపనున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 79098