శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం (Rathotsavam)
శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం (Mahotsavam)
పెదనిండ్రకొలను గ్రామంలోని స్వయంభూ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం (Rathotsavam) వైభవంగా కన్నుల పండువగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవ వేడుకలలో భాగంగా గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల రధోత్సవం సాయంత్రం 4 గంటల నుండి జరిగింది. కార్యక్రమంలో తొలుత స్వామి అమ్మవార్లను అలంకరించిన రథంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించగా, గ్రామస్థులు భక్తి శ్రద్దలతో పెద్దఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల రధాన్ని గ్రామపుర వీధులలో ఊరేగించారు. గ్రామస్థులు అరటిగెలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెదనిండ్రకొలను మరియు పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యి రాథోత్సవంలో పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జనసేన ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి