ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓటర్ల లిస్ట్ తయారీ, ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం హెచ్చరించింది. తాము చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 దరఖాస్తులు వస్తుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడంలేదని అధికారులను గట్టిగా ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కసరత్తు, ఓటర్ లిస్ట్ తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. వివిధ పార్టీల నేతలతో సీఈసీ బృందం భేటీ అయ్యింది. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశంలో సీఈసీ బృందం పాల్గొంది.
కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం..
78
previous post