కూలిన వంతెనలు (collapsed bridges):
చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండల పరిధిలో చిగురవాడ వద్ద స్వర్ణముఖినది వంతెన వద్ద ఓబీసి పోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. కూలిన వంతెనలకు మూడవ వార్షికోత్సవం నిర్వహించి, సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గత మూడు సంవత్సరాలకు క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే వంతెనలు కొట్టుకుపోయి మూడేళ్లకు పైగా అవుతున్నా ప్రభుత్వం ఇంత వరకు ప్రధాన రహదారిల్లో కూడా వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
దీంతో ఓబీసీ ఫోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో డప్పులు వాయిస్తూ, బాణాసంచా కాల్చుతూ, నియోజకవర్గ ప్రజలకు తాయిలాలు వద్దు అభివృద్ధే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ, కొట్టుకుపోయిన వంతెన వద్దకు వచ్చి పూలమాల వేసి, కేక్ కట్ చేసి తన నిరసన తెలిపాడు. ఈ సందర్బంగా బడి సుధాయాదవ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు నియోజకవర్గంలో కొట్టుకుపోయిన వంతెనలు మూడేళ్ళు అవుతున్నా నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాయిలాలు ఇవ్వకుండా అభివృద్ధి చేపడితే చాలు అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.