తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ., నటి జయప్రద (Jayaprada) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మాజీ ఎంపీ., నటి జయప్రద మీడియాతో మాట్లాడుతూ…ప్రతి ఏడాది నా పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ప్రజలు., రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్ననని అన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నని తెలిపిన ఆమె….ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే కచ్చితంగా పోటీచేస్తాని తెలియజేశారు. మోదీ., నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. ఎవరైతే రాజధాని తీసుకు రాగలరో., ఎవరైతే యువకులకు ఉద్యోగం., మహిళలకు రక్షణ కల్పించే వారే అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. మూడవ సారి దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని…. నాకు పవన్ కళ్యాణ్., బాలకృష్ణ అంటే చాలా ఇష్టమన్నారు. మోదీ., చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు. పిలిస్తే స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాక్ దానం చేయడం ఒక్క జయప్రద చాలదని వెల్లడించారు.
ఇది చదవండి: నేడు మంగళగిరిలో MDU వాహనలు తనిఖీలు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి