ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో టీడీపీ, ఒక నియోజకవర్గం జనసేనకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేనకు టికెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠత నెలకొంది. నిన్న టీడీపీ విడుదల చేసిన పేర్లలో జిల్లాలోని తిరుపతి పేరు మినహా మిగిలిన నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. చిత్తూరుకు చెందిన వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ జనసేన చేరిక తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు ప్రకటిస్తారని సమాచారం రావడంతో టీడీపీ జనసేన నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని నాన్ లోకల్ వ్యక్తులకు టికెట్ ఇస్తే సహకరించ కూడదని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కే తిరుపతి టికెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. దీంతో ఆరణి శ్రీనివాస్ కపిలతీర్థం లోని శివాలయంను, తిరుపతి గంగమ్మ ని దర్శనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి