పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాలెక్టరేట్లో కలెక్టర్ శివ శంకర్ లోతేటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మాట్లాడుతూ… మార్చి 16 ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత పకడ్బందీగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తున్నాము అన్నారు.
ప్రభుత్వ స్థలంలో ఉన్న 12094 వాల్ రైటింగ్, పోస్టర్లు తదితరాలు తొలగించాము అని పబ్లిక్ ప్లేసులో ఉన్న 5306 తొలగించము అన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కు పాల్పడిన వాలేంటర్లు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగుల ను మొత్తము 28 మంది చర్యలు తీసుకున్నాము అన్నారు. సి విజిల్ లో నమోదు అయిన 398 కేసులలో 94 శాతం పరిష్కరించామని జిల్లా వ్యాప్తంగా రూ 1.12 కోట్ల విలువ చేసే నగదు, లిక్కర్ సీసాలు, చీరెలు, వాటర్ బాటిల్స్ స్వాధీనం చేశాము అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో po, apo లకు శిక్షణ కు ప్లాన్ చేశామన్నారు. నరసరావుపేట మండలం jntu లో కౌంటింగుకు ఏర్పాట్లు చేశాం అని Evm లతో ఎన్నికలకు పూర్తి సమాయత్తం తో ఉన్నామన్నారు. మార్చి 31 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఏప్రిల్ 8 నుంచి 10 వరకు ఫార్మ్-6 తో దరఖాస్తు చేసుకోవచ్చు అని, ఫార్మ్-8 ద్వారా షిఫ్టింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు.
కలెక్టరేట్ లో కలెక్టర్ శివ శంకర్ మీడియా సమావేశం…
74