ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ఒడిశాకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నేటి రాత్రి తీరం దాటనున్న దానా తుపాన్ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి…
- చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న క్యాబినెట్ సమావేశంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా కేబీనెట్ సమావేశం జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన…
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా,…
- హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధరలుఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే. మార్కెట్లో చేపలు, చికెన్, మటన్ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి. అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో భారీగా…
- కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదుబండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని , తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ తో కలిసిపోయానన్న వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. లేదంటే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి