అల్పపీడనం ప్రభావంతో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ అధికారులు తెలిపారు.
అటు… నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో
గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఎడతెరిపి లేని వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సరైన సమయంలో వర్షాలు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది పెద్దసంఖ్యలో అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తా జిల్లాల్లో సగటు కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభంశ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు భృంగి వాహన…
- తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది.తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ…
- తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
- ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది.ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ప్రజలే. అయితే ఈ యుద్దం…
- నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి