Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh నేటి రాత్రి తీరం దాటనున్న దానా తుపాన్

నేటి రాత్రి తీరం దాటనున్న దానా తుపాన్

by Rama
నేటి రాత్రి తీరం దాటనున్న దానా తుపాన్.

ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ఒడిశాకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
  • కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
    తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
  • రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.
    రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
  • స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
  • పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.
    పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: