శ్రీశైలం మహాక్షేత్రంలో ఓ భక్తుడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలకు అనారోగ్యంతో చెరుకున్న గంట పాటు వైద్యశాల సిబ్బంది భక్తుడిని పట్టించుకోలేదని మృతుని భార్య ఆర్తనాదాలతో ఆందోళన చెందింది. అనారోగ్యం కారణాలతో వైద్యశాల ముందు ఆటోలోనే వైద్యుల కోసం గంటపాటు వేచి చూసిన ఫలితం దక్కలేదు. వైద్యశాల సిబ్బంది వైద్యశాలలోకి కూడ పేసెంట్ ను అనుమతించకుండ నిర్లక్ష్యం చేశారని అనారోగ్యంతో ఉన్న భక్తుడు ఆటోలో నరకయాతనకు గురయ్యాడు. వైద్యశాలకు చేరుకున్న భక్తుడిని ఎంతసేపటికి వైద్యశాలలోకి సిబ్బంది తీసుకెళ్లకపోవడంతో ఆలస్యంగా వచ్చిన 108 సిబ్బంది స్దానిక వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. గంటపాటు పేసెంట్ వైద్యశాల ముందు ఉంటే ఎందుకు లోపలికి అనుమతించలేదని గట్టిగా 108 సిబ్బంది వాగ్వివాదానికి దిగటంతో అప్పుడు వైద్యశాల సిబ్బంది వైద్యశాలలోకి పేసెంట్ ను స్టెచ్చర్ మీద తరలించారు.
వైద్యశాలలో వైద్యులు లేరని అందుకే బయట ఉంచామని వైద్యశాల సిబ్బంది 108 సిబ్బందికి వివరించారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే భక్తురాలి భర్త మృతి చెందేవాడు కాదని హాస్పిటల్ వద్ద ఆర్తానాధాలతో ఏడుస్తూ తమ భాద ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాకా నానా అవస్థలకు గురైంది. శ్రీశైలంలో వైద్యుల నిర్లక్ష్యంతో భక్తుడు మృతి చెందాడనే వార్త బయటికి పొక్కటంతో మల్లన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆందోళనకు గురయ్యారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బౌరంపేటకు చెందిన సిద్దం శెట్టి సురేష్ ప్రసాద్ (35) గా హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. అయితే నిన్న సాయంత్రం శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న సిద్దం శెట్టి సురేష్ ప్రసాద్ అనంతరం శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతి ఆలయం దర్శనానికి వెళ్లారు అక్కడ ఉన్నట్లుండి మృతుడు వాంతులు చేసుకుని అనారోగ్యంతో పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి కుటింబికులు సమాచారం అందించారు ఈలోపే ఆటోలో శ్రీశైలం ప్రాథమిక వైద్యశాలకు భక్తుడిని తరలించారు. గంటపాటు వైద్యశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో చివరకు హాస్పిటల్ వద్ద భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు.