మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉరవకొండ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రకటించారు. తొలుత వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు.
ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించి ఓటు విలువను ప్రజలకు వివరించారు. ఉరవకొండలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఎన్నికలు అతిపెద్ద పండుగ – దేశానికే గర్వకారణం’ అనే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వీప్ ఆకృతిలో ఆ అక్షరాలపై కూర్చుని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాలలో పి ఓ ఓపిపిలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న బెదిరింపులుకు పాల్పడిన తహసిల్దార్, ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి పారదర్శకంగా చర్యలు చేపడతామన్నారు.