అధికార పార్టీ నాయకుల అండదండలతో క్రైస్తవుల సమాధుల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని దీనిపైన అధికార పార్టీ నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ క్రైస్తవ ఐక్యవేదిక నేతలు రోడ్డుకెక్కారు. ఉయ్యూరు పట్నంలో మూడు డొక్కల రోడ్డులో గల క్రైస్తవుల సమాధులను ఒకటో వార్డు కౌన్సిలర్ సాయంతో ఆక్రమణలు చేసి సమాధులకు దారి లేకుండా చేయడంతో క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. క్రిస్టియన్ ల సమాధులు అన్యాక్రాంతమవుతుంటే అటు అధికార పార్టీ నేతలు ఇటు అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన క్రైస్తవ ఐక్యవేదిక నేతలు మంత్రి జోగు రమేష్ ను కలిసి తమ సమస్యలు వివరించామని ఎలక్షన్లు అయినాక నాలుగు ఎకరాల స్థలం కేటా ఇస్తామని హామీ ఇచ్చారని, ఆయన్ని కలిసి వచ్చాకే అధికార పార్టీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో తమ సమాధుల దారి సైతం లేకుండా ఆక్రమణకు గురయ్యాయని, ఎలక్షన్ కోసం హామీ ఇచ్చి తమ స్వలాభం కోసం ఆక్రమణలు చేస్తున్న వారికి ఎలక్షన్లలో తగిన విధంగా బుద్ధి చెబుతామని క్రైస్తవ ఐక్యవేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా తాము సమాధుల కోసం పోరాటం చేస్తుంటే ఇప్పుడు అధికార పార్టీ నేతల సహకారంతో ఉన్న సమాధులే అన్యక్రాంతరమవుతున్నాయని వారు వాపోయారు.
కౌన్సిలర్ సాయంతో సమాధుల స్థలాల ఆక్రమణ…
83
previous post