ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమయింది. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్దిదారులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీపం పథకం కింద ముందు పూర్తి ధరను చెల్లించిన తర్వాత సిలిండర్ ఖర్చును లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు.
ఏడాదిలో ప్రతీ కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం .. ఈరోజు తొలి సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. లబ్దిదారులు ఈరోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. పొందవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖతో కలిసి లబ్దిదారుల ప్రత్యేక ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు.
గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కుటుంబాలు అర్హులు అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే నిరుపేద కుటుంబాలకు మాత్రం అమలవుతుందా లేక ధనికులకు కూడా అమలు చేస్తారా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి