నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం సమీపంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి సుండిపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం వస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా శిఖరేశ్వరం వద్దకు చేరుకుని గంజాయితో వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీస్టేషనుకు తరలించారు. అయితే వారిలో ఒకరికి ఇరువై సంవత్సరాల వయసు నిండకపోవడంతో అతనిని మీడియాకు చూపలేదు.
వారిద్దరు గంజాయి ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు ఎన్ని రోజులుగా గంజాయి తీసుకువస్తున్నారనే కోనంలో శ్రీశైలం ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారిద్దరితో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ వాహనాన్ని మరియు గంజాయిని సీజ్ చేసి ఆత్మాకూర్ కోర్టుకు తరలించారు.