సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంఘీభావం తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మరియు వైస్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు పి.గన్నవరం త్రీ రోడ్ సెంటర్ నుండి భారీ ర్యాలీతో సంఘీభావం తెలుపుతూ జై జగన్ అంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక పక్క సీఎం జగన్ మాకు రావాల్సిన డిఏ లు ఇవ్వకుండా ఎగ్గొ్డుతునాదని పిఆర్సి పైన అసంతృప్తి వెళ్ళగక్కుతూ పైపైకి జగన్ జై అంటు లోలోన మదన పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాల వ్యవధిలో 1,30,000 వార్డు సచివాలయ ఉద్యోగాలను మెరిట్ ప్రకారం ఇవ్వడం జరిగిందని అందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. 50,000 ఆర్టిసి ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులు తో సమానం చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. అది కూడా మూడు నెలల వ్యవధిలోనే జరిగిందని వైద్య శాఖ లో 53వేల మంది ఉద్యోగులను నియమించిందని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రక్క వద్దు అనే దందాపనలో ఉన్న అందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఉద్యోగాలకు కారకులయ్యారని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని 105 రకాల మందులు ఇస్తున్నారని వృద్ధాప్యం వల్ల తిరగలేని వృద్ధులకు నెలనెలా ఇంటికి వచ్చి బీపీ షుగర్ వంటి పరీక్షలు చేసి కావలసిన మందులు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో కష్టకాలంలో అందరికీ కూడా పే స్కేల్స్ సరిపెట్టారు… ఏ రాష్ట్రంలోనూ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా సమయంలో జీతాలు ఇవ్వలేదని కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోని మాత్రమే జీతాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదు అని సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వాళ్ళకి విజ్ఞత లేదని ప్రతి నివేదికను కాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగులు సంఖ్య 44.85 లక్షలు కాగా 2023 మార్చి నాటికి ఈ సంఖ్య 60.73 లక్షలకు పెరిగింది అంటే 2019 23 మధ్య 4 నెలలు 15.8 లక్షలు ఉద్యోగాలు పెరిగాయని 2019 నుంచి 23 మధ్య నాలుగేళ్లలో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు జగనన్న ప్రభుత్వం ఇచ్చిందని ఇది అభివృద్ధి కాదా అని ఆయన మీడియా పూర్వకంగా తెలియజేశారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు నూతనంగా నిర్మించారు అంటే అది అభివృద్ధి కాదా అని అడిగారు.