67
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై వర్షపు నీరు చేరింది, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. 21 వేల క్యూసెక్కుల నీటితో కాలంగి నది ప్రమాదకరంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసారు. తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.