మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో గత ఎనిమిది రోజులుగా చేస్తున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వారు ఎండు గడ్డి ప్లేట్లలో పెట్టుకొని దాన్ని తింటూ వినూత్నంగా నిరసన తెలియజేసారు. మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలని, వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్మిక సంఘ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేయడంతో పట్టణంలోని చెత్త ఎక్కడికక్కడ నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also..