Jindal Land Dwellers :
ఎస్.కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసిన జిందాల్ భూ నిర్వాసితులు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భముగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినా కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎం.పి.టి.సిలు, జిల్లా అధికారులు, జిందాల్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూముల్ని జిందాల్ కు అప్పగించడానికి అంగీకరించాము. కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి, నగదు మరియు షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి, ఈరోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసంచేసే స్థితికి యాజమాన్యం వారు వచ్చారు.
మాలో మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధముగా, ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తము అందించే విషయమునకు సంబంధించి ఆ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు అనీ ఈ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు. షేర్లకు బదులు నగదు మొత్తము ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరి ఇదే విషయమై గతంలో ఎమ్మెల్సీ సమావేశమైనపుడు, జిందాల్ కంపెనీ నిర్మాణమునకు భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులకు నగదుతో పాటు కొంతమొత్తం అనగా ఒక్కో ఎకరా జిరాయితీ భూమికి రూ.2,00,000/-లు, డి.పట్టా భూమికి రూ.2,00,500/- చొప్పున షేర్ల రూపేణా యాజమాన్యం వారు పరిహారం క్రింద ఇచ్చారని, షేర్లు ఇచ్చినపుడు ఉన్న విలున (ఒక్క షేరు విలువ రూ.10/-లు) ఈ 15 సంవత్సరములలో వడ్డీతో పాటు మొత్తం విలువ పెరిగిందని, సేకరించిన ప్రతి ఎకరం భూమికి పెరిగిన మొత్తము ప్రకారం కంపెనీలో భాగస్వాములుగా గుర్తించి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. కానీ ఇంతవరకు ఈ విషయం తేలకపోగా ఇప్పుడు షేర్లు జారీ చేసినపుడు ఉన్న విలువ ప్రకారం బలవంతముగా సంతకాలు చేయించుకుని యాజమాన్యం నగదు ఇవ్వజూపడం అన్యాయం అని అన్నారు.
కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూములలో జిందాల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, అల్యూమినా కర్మాగారమునకు బదులు MSME పార్కు నిర్మాణమునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణముగా MSME పార్కు నిర్మాణం చేపట్టే ముందు అందులో ఏర్పాటు చేయబోయే కంపెనీల వివరములు ప్రజలకు తెలియజేస్తూ స్థానికముగా ప్రజాభిప్రాయం సేకరించి, పార్కులో ఏర్పాటు చేయబోయే కంపెనీల విషయమై విధివిధానాలను రైతులకు వివరించే విషయమై 45 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేయాలని జిందాల్ సి.ఇ.ఓ కనకారావు కోరుతూ, పత్రికాముఖముగా ప్రభుత్వ యంత్రాంగమును కూడా కోరడమైనది.
కానీ నేటివరకు ఎటువంటి చర్యలు చేపట్టనందుకు గాను, నిరసనగా రేపటినుండి జిందాల్ నిర్వాసితులు అందరూ నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలియజేసారు.