బీడీ కార్మికులు (Beedi Workers):
కడప జిల్లా కమలాపురంలో వందల సంఖ్యలో బీడీ కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఏళ్ళు గడిచి పోతున్నా బీడీ కార్మిక కుటుంబాల్లో ఆర్థికంగా పురోగతి లేదు. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న.. సరైన వైద్య సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడంలేదని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో డాక్టర్ లేడని.. సిబ్బంది ఉన్నా మందు బిల్లలతో సరిపెడుతున్నారని కార్మికులు చెపుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. బీడీలు చుట్టి ఆరోగ్యం దెబ్బతిన్న కార్మికులకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీడీలు తయారు చేస్తున్నా సరైన కూలి రాలేదని వారు ఆవేదనతో తెలిపారు. పాలకులు.. అధికారులు స్పందించి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు విన్నవించుకుంటున్నారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.