ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనలో భాగంగా సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
Read Also..
Read Also..