కడప (Kadapa) జిల్లా… ప్రొద్దుటూరు వైసిపీ అసమ్మతి నేతల (YCP Leaders) ఆత్మీయ సమావేశం సాయంత్రం కొర్రపాడు రోడ్డులోని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి చెందిన ఆయిల్ మిల్లో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ప్రకటించారు. సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో పాటు కౌన్సిలర్లు ఇర్ఫాన్ బాష, మురళీధర్ రెడ్డి, కొందరు శివచంద్రారెడ్డి వర్గానికి చెందిన వార్డు మెంబర్లు, అభిమానులు హాజరయ్యారు. ప్రొద్దుటూరు వైసిపిలో ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబ పాలనవల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామని, నియంతృత్వ ధోరణిని సహించలేకనే తాము వేరుగా వర్గం ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నట్లు నేతలు స్పష్టం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లుకు సహకరించమని అధిష్టానానికి కూడా స్పష్టం చేశామని, అదే దృక్ఫధంతో ఉన్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఎటు వైపు వెళ్ళాలన్న అంశంపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఇటీవల వైసిపి నుంచి టిడిపీలో చేరిన లక్ష్మిరెడ్డి సభ వేదికపై ఉండటం చర్చనియాంశమైంది. అలాగే సమావేశం ముగిసిన కాసేపటికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మరికొందరు టిడిపి నేతలు ఆ ఆత్మీయ సమావేశం జరిగిన చోటికి వచ్చి వైసిపి అసమ్మతి నేతలతో మాట్లాడటంతో ఇక అసమ్మతి ఎటు వెళతారన్నాదినై క్లారిటీ వచ్చినట్లైంది. అయితే ఈ అసమ్మతి నేతలు టిడిపి వైపు వెళతారా, లేక మరో పార్టీవైపు వెళతారా లేక మద్దతు ఇస్తారా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.
ఇది చదవండి: రేవంత్ రెడ్డి కి ప్రవీణ్ కుమార్ కౌంటర్..