కర్నూలు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో 40వ జాతీయ రహదారి రోడ్డు పక్కన ఎర్రటి కండల్లో వెలిసిన బుగ్గరామేశ్వర చిత్రంలో జాగరణ పర్వదినాన వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు మహిళలు తరలివచ్చి ఆలయంలో స్వామివారి కి పాలాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన దీప ధూప నైవేద్యాలు సమర్పించి ధ్వజ స్తంభానికి ద్విపొత్తులు వెలిగించి హర హర మహాదేవ ఓం నమఃశివాయ అంటూ ఓం నమఃశివాయ అంటూ భక్తులు వేడుకొంటూ తమ మొక్కుబడిని తీర్చుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తెల్లవారుజామున శివమాల ధరించిన స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి బుగ్గ రామేశ్వర స్వామి దర్శించుకుని శివలింగానికిపాలాభిషేకం అమ్మవారు కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని రైతులు బడుగు బలహీన వర్గాలు అందరు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని బుగ్గ రామేశ్వరుని వేడుకున్న ఎమ్మెల్యే కాటసాని.
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూల్ తాలూకా సిఐ ఆధ్వర్యంలో ఎస్సై రాజారెడ్డి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తయిన ఎర్రమల కొండలు, పచ్చటి మామిడి తోటలు, నిత్యం ప్రవహించే సెలయేరు మధ్య దినదిన ప్రవర్థమా నమై వెలుగొందుతున్న బుగ్గ రామే శ్వర క్షేత్రం ప్రకృతి సోయగానికి అద్దం పడుతోంది. ఈ క్షేత్రంలో వెలసిన భ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించు కునేందుకు జిల్లా నలుమూలల నుండిభక్తులు అశేషంగా తరలివస్తారు.
- దోష నివృత్తి కొరకు పరశురాముడు స్థాపించిన దేవాలయంలో ఇది ఒక క్షేత్రం….
- విజయనగర కాలంలో ఈ ప్రాంతం ముద్దనూరు కాల్వ సీమగా పిలవబడింది..
- ఈ క్షేత్రానికి ఉత్తర వాయు దిశలో బుగ్గ ద్వారా నీటి ఊట ఉద్భవించింది..
- నీటి బుగ్గ ఆధారంగానే ఈ క్షేత్రానికి కాల్వబుగ్గ అనే పేరు వచ్చింది…
- జంట నందులు,బసవన్న పాదాలు, తూరుగుండు, చెంబుగుండు,ఇక్కడ చారిత్రక విశేషాలు.. లక్ష వివాహాలకు వేదికగా నిలిచిన కాలబుగ్గ రామేశ్వరం స్వామి కోరుకున్న వారికి కొంగుబంగారం ఇస్తారన్న భక్తుల నమ్మకం.
- నేటి నుంచి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు….
- నేడు కాల్వ గ్రామం నుండి స్వామివారు కాల్వబుగ్గకు వరప్రయాణం
- 8న శివరాత్రి బ్రహ్మోత్సవాలకుఅంకురార్పణ ధ్వజారోహణము….
*9 తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, సాయంత్రం ప్రభోత్సవం..
*10న సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం…
*11న వసంతోత్సవం సాయంత్రం పారువేట…
*12న ఉత్సవ మూర్తులు కాల్వ గ్రామమునకు తిరుగు ప్రయాణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇది చదవండి: టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కోట్ల విస్తృత ప్రచారం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి