నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధానర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, చైర్మన్, మంత్రి కొట్టుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డికి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి శ్రీస్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించగా అర్చకులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు.
ఇది చదవండి: కొండపల్లి IDA పోల్యుషన్ అధికారుల ఆకస్మిక దాడులు..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి