ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇంత వరకు తమ సమస్యలు నెరవేర్చలేదని, ఇప్పటికైనా తమకు రావాల్సిన బకాయిలను
Follow us on : Facebook, Instagram & YouTube.
విడుదల చేయాలని, 11వ పిఆర్సి లో రావలసినటువంటి బకాయిలను, అదే విధంగా దీర్ఘకాలింగా పెండింగ్లో ఉన్నటువంటి డి ఏ బకాయిలను కూడా విడుదల చేయాలని, ఉద్యోగులు దాచుకున్నటువంటి జిపిఎఫ్ఐ రుణాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల ను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలు రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు.