గురజాల నియోజకవర్గంలో వైసిపిలో సీటు కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. గురజాల నుంచి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసిపి పార్టీ తరుపున కాసు మహేష్ రెడ్డి గెలిచారు. అయితే అప్పటికే పార్టీలో సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన సీటును త్యాగం చేసి మహేష్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాన్ని దూరంగా పెట్టాడు. ఎమ్మెల్యే కాసు తమకు ఏ పనులు చేయడం లేదని ఎమ్మెల్సీ వర్గం బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో పర్యటిస్తుండటంతో ఎమ్మెల్యే కాసు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హైకమాండ్ వద్ద ఎమ్మెల్సీ జంగా తన సీటు తనకే కావాలని, ఒకసారి నేను త్యాగం చేశానని మరోసారి త్యాగం చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని జంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు కాసు మహేష్ రెడ్డి కూడా గురజాల సీటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
Read Also..