Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర

ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర

by Satya
Lokesh Yuvagalam padayatra

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నిన్నటితో పూర్తి అయింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దిగ్విజయంగా లోకేష్ పాదయాత్ర జరిగింది. మొత్తం 3వేల 132 కిలో మీటర్లు మేర లోకేష్ పాదయాత్ర చేశారు. గతంలో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఎక్కడైతే ముగించారో లోకేష్ కూడా అక్కడే తన యువగళం పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. వారందరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అసమర్ధుడు సీఎం అయ్యారని, వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని చెప్పారు. భవిష్యత్ పై ఆశలు కోల్పోయిన యువతకు తన యువగళం పాదయాత్రతో భరోసా కల్పించానని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014159
Total views : 79295

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.