పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంత గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన, రహదారులను ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. మొగల్తూరు మండలంలోని పాతపాడు, పేరుపాలెం, కెపిపాలెం గ్రామాల్లో పలు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పాతపాడు గ్రామంలో రూ 27.6 లక్షలతో చేపట్టిన మంచినీటి సరఫరా పనులకు, పేరుపాలెంలో రూ 28 కోట్లుతో నిర్మిస్తున్న ముత్యాలపల్లి – మోళ్ళపర్రు సీసీ రోడుకు, ‘పేరుపాలెం బీచ్ లో రూ 4.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం, అదే గ్రామంలో మెట్రేవు నుండి మోళ్ళపర్రు వరుకు రూ 8 కోట్లతో నిర్మించే సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కెపిపాలెం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్రా దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెపిపాలెం, పేరుపాలెం బీచ్‌లను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మాణం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. 2020లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించి కెపిపాలెం, పేరుపాలెం బీచ్‌లకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరున నామకరణం చేసిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గ్రేడ్ వన్ బీచ్ గా వైజాగ్ లోని భీమిలి బీచ్ ప్రసిద్ధి చెందితే గ్రేడ్ టూ గా పేరుపాలెం బీచ్ పేరు దక్కించుకుందన్నారు. దీంతో బీచ్ మరింత బివృద్దికి సులభం అవుతుందన్నారు. మోళ్ళపర్రు నుండి కెపిపాలెం బీచ్‌లకు డబుల్ రోడ్డులు ఇప్పటికే ఒక లైన్ రోడ్డు పూర్తయిందని మరో లైన్ రోడ్డు నిర్మాణ దశలో వుందని అన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముదునూరి…
66
previous post