22వ నంది నాటకోత్సవాలను గుంటూరులో ప్రారంభించామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అంతరిస్తున్న ప్రాచీన కళలపరిరక్షణ కోసం ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం పుట్టినరోజు సందర్భంగా ఈ కళాప్రాంగణానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. మొదటిసారి గా కళాకారులకు ఏసీ గదుల్లో వసతి ఏర్పాటు చేశామన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు జగన్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. 29వ తేదీన ప్రతిభ కనపరచిన వారికి అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. నంది నాటకోత్సవాలు 27మంది న్యాయనిర్ణేతలుగా కార్యక్రమం పర్యవేక్షణ చేస్తారన్నారు సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి. నిష్పాక్షికంగా అర్హులైన కళాకారులను సెలెక్ట్ చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉన్నంత కాలం ఎవరైతే అర్హుడు ఉన్నారో వారే నంది తీసుకు వెళతారన్నారు.
Read Also..
Read Also..