ఐదేళ్ల కాలంలో టిడిపి నేతలు చేసిన పని తీరును బట్టి చంద్రబాబు టికెట్లు కేటాయించారని పెద్దాపురం టిడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మొదటి విడతలో చినరాజప్పను పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన తర్వాత నియోజకవర్గం వచ్చిన రాజప్పకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి… గజమాలలు వేసి… భారీ ర్యాలీ నిర్వహించారు. జె తిమ్మాపురంలో టీడీపీ కార్యాలయాన్ని రాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లుగా పార్టీకి పనిచేసిన వారికి చంద్రబాబు తగిన గుర్తింపు ఇచ్చారని… వైసీపీలో ఆ పరిస్థితి లేదని సీఎం జగన్ వల్లే 175 స్థానాల్లో వైసిపి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు వెనుకబడి ఉన్నారని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వరాశనం చేశారని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కు ప్రమాదం తప్పింది… టికెట్టు ప్రకటించిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గా వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది. ప్రమాద సమయంలో రాజప్ప కారులోనే ఉన్నారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. టీడీపీ కార్యకర్తలు వాహనాన్ని కిందకి దించి పంపారు.
పెద్దాపురం టీడీపీ అభ్యర్థి చినరాజప్ప…
104