ఉరిటి స్వప్న ప్రియ, సురేష్, మరో ఆరుగురు ఉద్యోగులు గోల్డ్ గోల్ మాల్ కేసులో ఉన్నారు.. ఈ కేసులో 86 బ్యాగ్ లు మాయమయ్యాయి అని, అందులో 26 బ్యాగులను ఉద్యోగులు వెనక్కి ఇచ్చారని పోలీసులు తెలిపారు. లోహిత కన్సల్టెన్సీ తిరుమల రావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని, సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని తెలిపారు. లోహిత కన్సల్టెన్సీ తిరుమలరావు ను అరెస్ట్ చేశామని, బ్యాంక్ ఉద్యోగి సురేష్ పరారీలో ఉన్నాడని అన్నారు. సంవత్సర కాలంగా గోల్డ్ ని బయటకు మల్లించి.. ప్రైవేట్ బ్యాంకులైన సి ఎస్ బి, ఫెడరల్ బ్యాంక్ లలో బినామి పేర్లతో నిందితులు గోల్డ్ ను తాకట్టు పెట్టేవారని అన్నారు. డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ, సోదరుడు కిరణ్ వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ లో పెట్టేవాడిని అన్నారు. తాను దొరికిపోయాను అని తెలుసుకున్న డిప్యూటి మేనేజరు స్వప్నప్రియ సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సి ఏస్ బి,ఫేడరల్ బ్యాంక్ అధికారులతో సహా 7 గురుని అరెస్ట్ చేసామని, బ్యాంక్ ఉద్యోగి సురేష్ కోసం గాలిస్తున్నామని, బ్యాంక్ లో మాయమైన 7 కేజీల 195 గ్రాముల గోల్డ్ ను పూర్తిగా రికవరీ చేశామని తెలిపారు.
గోల్డ్ గోల్ మాల్ కేసును ఛేదించిన పోలీసులు…
54
previous post