నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బనగానపల్లె ఎమ్మెల్యే తనయుడు కీ.శే నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను శనివారం ఉదయం బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన సతీమణి జయమ్మలు ప్రారంభించారు. ముందుగా హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కుటీరాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించి, అనంతరం భోగి మంటలను అంటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కాటసాని జయమ్మ, వారి కోడలు శ్రీమతి కాటసాని మేధా శ్రీరెడ్డి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు భోగి మంటల ముందు నృత్యాలు చేశారు. అనంతరం ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే కాటసాని దంపతులు ప్రారంభించారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఎమ్మెల్యే కాటసాని దంపతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వే టు డాన్స్, జబర్దస్త్ టీమ్ నిర్వహకులచే డాన్స్ కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు మొదటి బహుమతి రేణుకకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, రెండవ బహుమతి భారతికి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్, మూడవ బహుమతి ఇంద్రవతికి ఎల్ ఈడి టీవీ, నాల్గవ బహుమతి అంజనమ్మకు వాషింగ్ మిషన్, ఐదవ బహుమతి నీరజకు రైస్ కుక్కర్ లను బహుమతుల ప్రదాత కాటసాని జయమ్మ అందచేశారు.
సంక్రాంతి ముగ్గుల పోటీలు…
108
previous post