మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని కోత కోసి పనలపై ఉన్న వరి పంట పూర్తిగా నీటి మునిగి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలోని వందలాది ఎకరాల వరి పంట తడిసి ముద్దయింది. ఏలూరు మండలంలోని మల్కాపురంలో పనల మీద ఉన్న వరి పంటను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పనల మీద ఉన్న పంట తడిసి పోవడంతో మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అందువలన అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ కోరారు. ధాన్యం కోనుగోలులో ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో వాహనాలు ఏర్పాటు చేయకపోవడం వలన కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన తుఫాను… అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిందని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
తడిసి ముద్దయిన వరి పంట….
70
previous post