అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ ,హోమం కార్యక్రమాలు శుక్రవారం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు జరుగుతున్నా హోమం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వారికీ ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ వారి భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ పోలం రెడ్డి దశరథ రామిరెడ్డి, ఆలయ ఈవో రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం వేద పురోహితులు పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నా హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనున్న వినాయకుడిని, అఘోర లింఘేస్వరుడు తో పాటు శ్రీ వీరభద్ర స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు. వారికీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఆలయ అభివృద్దితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ, ఈవో రమణా రెడ్డి, శ్రీశైలం వేదం పురోహితులు పరమేశ్వర స్వామి లు మాట్లాడుతూ 2019 లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ రాజ గోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమం అప్పట్లో నిర్వహించలేకపోయామన్నారు. తిరిగి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ కృషితో పశ్చిమ రాజగోపురం సాలహారం ల నిర్మాణాలకు రూ 1.58 కోట్ల నిధులు మంజూరై పనులు కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుండి పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలియజేశారు. అందరికి శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాల తో పాటు శ్రీ భ్రమ రాంబ మల్లి కార్జున ఆశీస్సులతో మెండుగా కలగాలని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు రత్న శేఖర్ రెడ్డి, సంబేపల్లె నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ రాజ గోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవం, హోమాల కార్యక్రమం…
69
previous post