విశాఖ -భువనేశ్వర్ వందే భారత్ రైలు (visakha-bhuvaneswar vandhe bharath)ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలవడంతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రైల్ లో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం (Ichchapuram) వరకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) ప్రయాణించారు. ఇచ్చాపురంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుకి రైల్వే అధికారులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్, తో పాటు టిడిపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడు రైల్వేస్టేషన్లలో ఆగడం ఆనందమని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి శ్రీకాకుళం ఎంపీ పరిధిలోని పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి విన్నవించగా, ఒకటొకటిగా పరిష్కారం అవుతున్నాయని ఎంపీ రామ్మోహన్ అన్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
త్వరలో మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైలు ఇచ్చాపురంలో ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జి, జాడపూడిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ జరగనున్నదని అన్నారు. రైల్వేపరమైన అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు శ్రీకాకుళం జిల్లా కు తాము చేసిన కృషికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని,తమ వద్దకు వస్తే అన్ని చూపుతామని అన్నారు ఎంపీ రాము రామ్మోహన్ ఇచ్చాపురం రైల్వే సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంగా ఇచ్చాపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఇదిచదవండి: ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడు ఆత్మహత్య..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి