శ్రీశైలం :
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న సాత్వీకబలులను నిర్వహించేందుకు కొబ్బరికాయలు, నిమ్మకాయలు సిద్దం చేశారు. ముందుగా ఆలయంలో అర్చకులు వేదపండితులు అమ్మవారికి ప్రత్యేకపూజలు పూజలు నిర్వహించారు. ఈఓ పెద్దిరాజు సిబ్బంది అమ్మవారికి కొబ్బరి కాయలు పసుపు కుంకుమను శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయానికి బాజా భజంత్రీల నడుమ తీసుకువెల్లగా అక్కడ ప్రత్యేకపూజలు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం. ఆలయ సంప్రదాయం అందులో బాగాంగా ఇవాళ శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి