లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టంగుటూరు ఎస్సై (Tangutoor SI)..
లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై (Tangutoor SI) ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్ఐను పట్టుకున్నారు. టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెంలో వైసీపీకి చెందిన మార్టూరి వెంకట్రావు అనుమతి లేకుండా పొగాకు బ్యారన్లు నిర్మిస్తుండటంపై కొద్దిరోజుల క్రితం అప్పటి పంచాయతీ కార్యదర్శి సాంబయ్య ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్యారన్ నిర్మిస్తున్న మార్టూరి వెంకట్రావు తనను సర్పంచ్ తనయులు కొమ్మినేని వెంకట్రావు, శ్రీనివాసరావు బెదిరిస్తున్నారని ఎస్ఐకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి : కడప తహసీల్దార్ అరెస్ట్.. రిమాండ్…
కేసు పెట్టకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్..
దీంతో సర్పంచ్ తనయుడు వెంకట్రావును స్టేషన్కు పిలిపించిన ఎస్సై.. ‘బ్యారన్లు నిర్మిస్తున్న వెంకట్రావును మీరు బెదిరిస్తున్నట్టు అతను ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష డిమాండ్ చేశాడు. అందుకు ఆయన అంగీకరించాడు. సర్పంచ్ రెండో కుమారుడైన శ్రీనివాసరావు తొలివిడత గత నెల 29న ఎస్సైకి రూ.30వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు త్వరగా ఇవ్వాలని ఎస్ఐ హుకుం జారీ చేయడంతో సర్పంచ్ తనయులు ఈ నెల 1న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శ్రీనివాసరావు మంగళవారం టంగుటూరు వచ్చారు. అనంతరం ఎస్ఐకి ఫోన్ చేయగా, స్థానిక చెల్లమ్మతోటలోని తన నివాసానికి రావాలని సూచించారు. అక్కడ ఎస్ఐకు రూ.70 వేలు ఇవ్వగానే అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి