ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) :
ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం కురిచేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి ఫోన్ వచ్చింది. దాని ప్రకారం దర్శి మండలం లోని అబ్బయపాలెం కు చెందిన దర్శి వెంకట రమణ అనే మహిళకు పురిటి నొప్పులు రావటం తో స్థానిక ఎస్. ఎస్. ఆర్ హాస్పిటల్ కు బంధువులు తీసుకువచ్చారు. ఉమ్మ నీరు చేరింది. అర్జెంటు గా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వెంటనే ఒంగోలు గాని గుంటూరు తీసుకువెళ్ళాలని.. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిర్ధారించడంతో… విషయం తెల్సుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం సైతం మధ్యలో నే వదిలేసి… హాస్పటల్ కు వచ్చి మహిళకు విజయవంతం గా సర్జరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ కు జన్మనించింది. తల్లి, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గా ఎన్నికల ప్రచారంలోనూ తన బాధ్యతను మర్చిపోకుండా ప్రాణాప్రాయంలో ఉన్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేయడంపై గొట్టిపాటి లక్ష్మిని.. శభాష్ గొట్టిపాటి అంటూ దర్శి ప్రజలు అభినందిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
- ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…