Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…

రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…

by Prakash
NDA Alliance

ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) :

ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం కురిచేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి ఫోన్ వచ్చింది. దాని ప్రకారం దర్శి మండలం లోని అబ్బయపాలెం కు చెందిన దర్శి వెంకట రమణ అనే మహిళకు పురిటి నొప్పులు రావటం తో స్థానిక ఎస్. ఎస్. ఆర్ హాస్పిటల్ కు బంధువులు తీసుకువచ్చారు. ఉమ్మ నీరు చేరింది. అర్జెంటు గా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

వెంటనే ఒంగోలు గాని గుంటూరు తీసుకువెళ్ళాలని.. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిర్ధారించడంతో… విషయం తెల్సుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం సైతం మధ్యలో నే వదిలేసి… హాస్పటల్ కు వచ్చి మహిళకు విజయవంతం గా సర్జరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ కు జన్మనించింది. తల్లి, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గా ఎన్నికల ప్రచారంలోనూ తన బాధ్యతను మర్చిపోకుండా ప్రాణాప్రాయంలో ఉన్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేయడంపై గొట్టిపాటి లక్ష్మిని.. శభాష్ గొట్టిపాటి అంటూ దర్శి ప్రజలు అభినందిస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.
    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు…
  • ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.
    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు మాచవరం జయంతి నగర్‌లో…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: