Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ…

వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ…

by Prakash
Ongole MP Magunta Srinivasulu Reddy

ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ… 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని… ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలను పోటీ చేశానని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు. మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203017

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: